తెలంగాణలో ఒక తాపీమేస్త్రీ డబ్బుకి కక్కుర్తిపడి కటకటాలపాలయ్యాడు. పరిచయస్థుడైన ఓ బడా డ్రగ్ డీలర్ 8 కిలోల ఎంఫిటమైన సరకును దాచమని తాపీమేస్త్రీకి ఇస్తే.. దాన్ని అమ్ముకుని కోట్లు సంపాదించాలని కక్కుర్తిపడ్డాడు. కానీ.. ఊహించని విధంగా జైలుపాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన కుంచాల నాగరాజు(34) తాపీమేస్త్రీకి అంజిరెడ్డి అనే డ్రగ్ డీలర్‌తో పరిచయం ఏర్పడింది. ఇటీవల మూడు ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన ఎంఫిటమైన్ ముడిసరకును నాగరాజుకు ఇచ్చిన అంజిరెడ్డి భద్రపరచమన్నాడు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో అంజిరెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాడు. దాంతో ఆ డ్రగ్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలని ఆశపడిన నాగరాజు దాన్ని తరలిస్తూ పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. నాగరాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు రూ. 8.5 కోట్ల విలువైన ఎంఫిటమైన్, 3 మొబైల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
Share