ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర నేడు జరగనుంది. నేటి రథయాత్రకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. 1971 తర్వాత తొలిసారి ఒకేరోజు జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్రస్వామి, సుభద్ర శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనాన్ని వీడి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి యాత్రగా చేరుకుంటారు. ఈ రథయాత్రకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పూరీజగన్నాథుడి రథయాత్రలో తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. గతంలో రాష్ట్రపతులు ఎవరూ ఈ యాత్రకు హాజరు కాలేదు. గవర్నర్ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగుతారు.