Current Date: 25 Nov, 2024

నేటి నుంచి 19వ G20 సదస్సు.. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ..

నైజీరియాలో ఆదివారం తన తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు సోమవారం బ్రెజిల్ చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో దిగినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో సమ్మిట్‌లో చర్చలు, వివిధ ప్రపంచ నేతల చర్యల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బ్రెజిల్‌లో జరిగే 19వ జీ20 సదస్సులో ట్రోకా సభ్యునిగా ప్రధాని మోదీ పాల్గొంటారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం G20 ట్రోకాలో భాగం. ఈ రోజు, రేపు జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే నాయకులలో ప్రధాని మోడీతో పాటు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. చివరి దశలో ప్రధాని మోదీ నవంబర్ 19 నుంచి 21 వరకు అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానాలో పర్యటించనున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.

Share