సీనియర్ కథానాయికగా రాజకీయ నాయకురాలుగా రోజా సమర్ధవంతమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. మా అమ్మానాన్నలు చనిపోయిన తరువాత మా అన్నయ్యలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. సెల్వమణి గారి సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. నేను పెద్దగా మాట్లాడతాను గానీ, ఇంట్లో పెత్తనం ఆయనదే" అని అంటూ చెప్పుకొచ్చారు. మా అబ్బాయి కౌశిక్ ఇప్పుడే 6 అడుగులు ఉన్నాడు . చదువుకుంటున్నాడు. తనకి హీరో కావాలని ఉంది .. అలాగే డైరెక్షన్ పై కూడా ఇంట్రస్ట్ ఉంది. భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉంటే అలా" అని అన్నారు. మా పాప అన్షు మాలిక కి మాత్రం చదువు అంటేనే ఇష్టం. తనకి సైంటిస్ట్ కావాలని ఉంది. ఒకవేళ యాక్టింగ్ వైపు వస్తానంటే మాకు కూడా సంతోషమే. నాకు మూడు చోట్లా మూడు ఇళ్లు ఉన్నాయి. అవన్నీ నేను రాజకీయాలలోకి రావడానికి ముందు ఉన్నవే. ఇక మూడు కార్లు ఉన్నాయి. 150 సినిమాలు చేసిన నాకు బెంజ్ కారు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. ట్రోలింగ్ చేసే వాళ్లను గురించి నేను పట్టించుకోనని సృష్టతనిచ్చారు.
Share