Current Date: 27 Nov, 2024

ఆగస్టు 15 నుంచి పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైలు,

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. చాలాకాలంగా వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం డిమాండ్ ఉండటంతో రైల్వే శాఖ ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించింది. చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారవుతున్న వందేభారత్ స్లీపర్ రైలు పిక్స్ ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అందరిలో ఆసక్తి మరింతగా పెరిగింది.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించవచ్చని దక్షిణ మద్య రైల్వే అధికారులు వెల్లడించారు. తొలి స్లీపర్ రైలు కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంటుందని తెలుస్తోంది.రైల్వేలో బిజీ రూట్స్‌గా పరిగణించే కాచీగూడ-విశాఖపట్నం, కాచీగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లను నడిపే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉందని తెలుస్తోంది. మొదటి రైలు సికింద్రాబాద్-పూణే మార్గంలో నడవవచ్చని తెలుస్తోంది. 

Share