Current Date: 06 Jul, 2024

మే14న ప్రత్యేక క్యాజువల్ లీవ్...

ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మే 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు ,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బంది కి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) వర్తించనుంది .