ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈమేరకు రికార్డు ధ్రువపత్రాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది.