Current Date: 26 Nov, 2024

విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ 12వ ఏడీజే కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గుమెంట్స్

ఏపీ విద్యా శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ఉదయం జిల్లా  కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు మధ్యాహ్నం 12వ ఏడీజే కోర్టులో   నారా లోకేష్ సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.  తనపై 'చినబాబు చిరుతిండి. రూ. 25 లక్షలండి' పేరుతో సాక్షి దిన పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై నారా లోకేష్ స్పందించి, ఈ కథనంపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ కథనంపై కోర్టులో లోకేశ్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన సంగతి విజితమే. తన పరువునకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారంటూ లోకేష్ కోర్టుకి దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేశ్ హాజరవ్వగా ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య  క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. లోకేష్ తరఫున టిడిపి లీగల్ సెల్ మానం శోభన్ బాబు కోర్టుకు హాజరు కాగా, సాక్షి తరఫున  డిఫెన్స్ న్యాయవాది  హబీబుల్లా హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టులో   క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి.

Share