Current Date: 09 Oct, 2024

విశాఖ హార్బర్ లో మునిగిన బోట్లు వెలికితీత రూ.1.2 కోట్లతో పనులు

ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు విశాఖపట్నం పోర్టు 150 కోట్ల రూపాయలతో అనే క అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా సముద్ర కాలుష్యం తగ్గించేం దుకు జెట్టీల్లో డెబ్రిస్ తొలగింపు, గతంలో తుపాన్ల కారణంగా జెట్టీల కింద మునిగి పోయిన బోట్లను వెలికి తీసేందుకు విశాఖ పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. పోర్ట్ కార్యదర్శి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో పోర్ట్ అధికారుల బృందం హార్బర్లోని అన్ని జెట్టీలను పరిశీలించింది. ఆరు ట్రాలర్లు, మరో 11 బోట్లు మునిగిపోయి ఉన్న ట్టు లెక్క తేలింది. వాటికి తోడుగా చెత్తాచెదారం కూడా భారీగా పేరుకు పోయినట్లు గుర్తించారు. దీంతో జెట్టీల్లో పది మీటర్ల లోతున ఉన్నవాటిని వెలికి తీసేందుకు 1.2 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. డిసెంబరు నెలాఖరుకు ఈ పనులు పూర్త య్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.

Share