Current Date: 02 Apr, 2025

సొంత బ్యానర్ లో అల్లు అర్జున్ సినిమా ఉండదా? 1000 కోట్లు రిస్క్ చేయాలా?...

తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా చావాని గీత ఆర్ట్స్ తెలుగులో రిలీజ్ చేయబోతుంది. ఈ క్రమంలో బన్నీ వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడగా అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్, ఆయనతో మీ సొంత బ్యానర్ లో మళ్ళీ సినిమా ఉంటుందా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బన్నీ వాసు సమాధానమిస్తూ.. ఇప్పుడు ఆయన డేట్స్ మాకు దొరకాలి అన్నా ఒక మూడు నాలుగేళ్లు ఎదురు చూడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలంటే కనీసం 1000 కోట్లు రిస్క్ చేయాలి. అరవింద్ గారు ఇప్పుడున్న ఏజ్ లో, అయన ఉన్న హ్యాపీ పరిస్థితుల్లో అంత పెద్ద సినిమా బాధ్యత తీసుకుంటారా లేదా చూడాలి అని అన్నారు.

Share