Current Date: 02 Apr, 2025

ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌ మ్యాచ్‌పై హర్భజన్‌ కామెంట్స్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌ మ్యాచ్‌ వేళ భారత మాజీ ప్లేయర్‌ హర్భజన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తలపడుతుండడంతో ఆసీస్‌ బ్యాటర్లను ఎలా కట్టడి చేయాలో చెప్పారు. భారత బౌలర్‌ మహమ్మద్‌ షమీకి హర్భజన్ సింగ్ పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రావిస్‌ హెడ్‌ మీద ఉన్న భయాన్ని మనసులోంచి తీసేయాలని చెప్పారు. ట్రావిస్‌ హెడ్‌ను కట్టడి చేయాలని, వీలైనంత తొందరగా ఔట్ చేయాలని అన్నారు. ఆసీస్‌ జట్టులో మ్యాక్స్‌వెల్‌, జోష్‌ వంటి గొప్ప బ్యాటర్లు ఉన్నారని చెప్పారు. వారు భారీ షాట్లతో వేగంగా రన్స్ తీస్తారని తెలిపారు. అటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకూడదని తెలిపారు. ఆడుతున్నది నాకౌట్‌ మ్యాచ్‌ కాబట్టి అతిగా ఏ విషయమూ ప్రయత్నించాల్సిన అవసరం లేదని, మహమ్మద్‌ షమీ ఇప్పటివరకు ఆడిన విధానాన్నే కొనసాగించాలని తెలిపారు.

Share