Current Date: 02 Apr, 2025

అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం...

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ఈరోజు  ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే 10 గంటలకు శాసన మండలి సమావేశాలు  ప్రారంభమవుతాయి. ఉభయ సభలు  ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా 2025-26 బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం  ప్రకటన చేయనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. కాగా సభ ప్రారంభమైన వెంటనే తెల్ల రేషన్ కార్డులు భూవివాదాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు... వాటికి సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో అత్యవసర చర్చగా విదేశాల్లో చదువుతున్న భారతీయ మెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చ జరగనుంది. మెడికల్ గ్రేడ్యుయేట్‌ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ సమాధానాలు ఇస్తారు. మరోవైపు శాసనమండలి క్వశ్చన్ అవర్‌లో కీలక ప్రశ్నలపై చర్చ జరగనుంది. బాలికల హాస్టల్‌లో సమస్యలు.. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బీసీల సంక్షేమం, చేనేత కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి

Share