Current Date: 28 Nov, 2024

కవిత జైలుకెళ్లి 100 రోజులు మర్చిపోయిన తెలంగాణ!

అధికారం లో ఉన్నప్పుడు ఆడింది ఆట పాడింది పాట..కుటుంబ పాలన అని జనం గగ్గోలు పెట్టినా కేసీఆర్ ఎవరి మాట వినలేదు. రాజ్యానికి రాజులా... మరో నిజాంను తలపించేలా పాలన చేశాడు. కుమార్తె కవితను కట్టడి చేయడంలో వైఫల్యం.. నెమ్మదిగా కేసీఆర్ మెడకు చుట్టుకొని అధికారం పోయింది.కర్ణుడి చావుకు 100 కారణాలులా కేసీఆర్ ఓటమికి కూడా అన్ని కారణాలు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కవిత వసూళ్ల పర్వం నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. వాటికి తోడు బతుకమ్మ పేటెంట్ రైట్స్ కవితకు ఇవ్వడం ప్రతి సంవత్సరం వందల కోట్లు బతుకమ్మ పేరుతో వెనకవేసుకోవడం అలవాటుగా మారిపోయిందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ప్రజల్ని ఆలోచింపజేశాయి.మీడియాను భయపెట్టి బతుకమ్మా అంటే కవిత...కవిత అంటే బతుకమ్మ అన్నట్లు ప్రచారం చేశారు.రాష్ట్రంలోనే కాదు విదేశాలలో కూడా బతుకమ్మ, తెలంగాణ జాగృతి పేరుతో వందల కోట్లు కవిత వసూళ్లు చేసిందని విమర్శలు వచ్చాయి. లిక్కర్ స్కాంతో జైలు పాలైంది. కవిత జైలుకెళ్లి 100 రోజులు అవుతున్నా కేసీఆర్ కనీసం చూడటానికి కూడా వెళ్లలేదు. కేసీఆర్ గతంలోనే ఈ లిక్కర్ స్కాం గురించి హెచ్చరించినా.. కవిత వినకపోవడమే ఈ కోపానికి కారణమనే వార్తలూ వినిపిస్తున్నాయి. 

Share