ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు శుక్రవారం అధికారులు ప్రకటించారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్జీ బృందం తనిఖీలు చేపట్టింది. భద్రతా బలగాలను చూసి మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎకౌంటర్ ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Share