Current Date: 06 Jul, 2024

ఎఫ్‌డీఐలో కనిపించని ఏపీ.. టాప్-10లో చోటు గల్లంతు!

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేస్తున్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 44.42 బిలియన్‌ డాలర్లు. అంటే.. భారత్ కరెన్సీలో రూ.3,67,899 కోట్లు. ఇందులో అత్యధిక మొత్తాన్ని అందుకున్న 10 రాష్ట్రాల్లో ఏపీ కనిపించలేదు.రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ జగన్ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఊదరగొడుతోంది. కానీ.. ఎక్కడరా అంటే సమాధానం చెప్పడం లేదు. అలానే జగన్ ప్రతి సభలోనూ పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపించాం అని చెప్పుకుంటున్నారు. కానీ.. ఎఫ్‌డీఐ విషయంలో తెలంగాణ 7వ స్థానంలో నిలవగా.. ఏపీ మాత్రం టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలో 30% పెట్టుబడులు అందుకున్న మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు 3% అందినట్లు పరిశ్రమ ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం తెలిపింది. 2023-24లో 302.90 కోట్ల డాలర్లు అంటే భారత్ కరెన్సీలో రూ.25,094 కోట్లు మేర ఎఫ్‌డీఐ చేరింది.