2014లో జరిగిన ఓ హత్య కేసులో ముద్దాయి ప్తెలా రమణకు కోర్టువారు 10 సంవత్సరాలు కారాగార శిక్షతో పాటు 10లక్షలు రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తీర్పును ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వర్ రావు అందించిన వివరాలు ప్రకారం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్లో గల నాతవరం స్టేషన్ పరిధిలో శృంగవరం గ్రామానికి చెందిన పైల రమణకు అదే గ్రామంలో అతనికి వరుసకు మేనల్లుడు అయిన సుర్ల వెంకట రమణకు భూమి తగాదాలు ఉన్నాయి. 2014 అక్టోబర్ 25న సాయంత్రం 4:30 గంటలకు సుర్ల వెంకటరమణ ఎ. శరభవరం గ్రామంలో సంతకు వెళ్లాడు. సుమారు 5:30 గంటల సమయములో పైలారమణ, సుర్ల వెంకటరమణలు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు.