నరేంద్ర మోదీ భారత దేశంలో ఎవరికి పరిచయం అక్కర లేని పేరు. మోడీ పేరు ఎత్తని రాజకీయ పార్టీ కానీ.. నాయకులు లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దూకుడు.. ప్రధాన మంత్రిగా భారతీయ రాజకీయాలపై చెరగని ముద్ర వేసారు. మే 26తో ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవేతొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల తర్వాత 10 యేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు. 2014 మే 26న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా నరేంద్ర మోదీతో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. 2019లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అంతకు ముందు 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.జన్ ధన్ యోజన, స్వచ్ఛ్ భారత్, ప్రపంచ యోగా దినోత్సవం ఆయుష్మాన్ భారత్, వందేభారత్,దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి ఎన్నో ప్రజా ఉపయోగ పనులతో ప్రజల గుండెల్లో నిలిచారు. అంతేకాదు తన హయాంలో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్, CAA వంటి ఎవరు టచ్ చేయడానికి భయపడే వాటిని చట్టాలుగా చేసిన ఘతన మోదీ ప్రభుత్వానికి దక్కుతోంది.ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ పీఎం అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా రికార్డులకు ఎక్కనున్నారు. మన దేశం నుంచి బతికి ఉండగానే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన తొలి రాజకీయ నేతగా గుర్తింపు పొందారు.