Current Date: 27 Nov, 2024

ఆగస్టు 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ రూల్స్ మార్పు

ఆగస్టు 1, 2024 నుండి కొత్త ఫాస్ట్ టాగ్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు టోల్ చెల్లింపులను సులభతరం చేయడం మరియు టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉన్నాయి. 5 సంవత్సరాల కంటే పాత ఫాస్ట్ టాగ్ లను అక్టోబర్ 31లోపు రెన్యువల్ చేయడం తప్పనిసరి. మూడు సంవత్సరాల క్రితం జారీచేసిన ఫాస్ట్ టాగ్ లకు కెవైసీ అప్‌డేట్‌లు తప్పనిసరి, అవి అక్టోబర్ 31లోపు పూర్తి చేయాలి. వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌లను ఫాస్ట్ టాగ్ ఖాతాలకు అనుసంధించాలి. అదనంగా, డేటాబేస్ ధృవీకరణ చేయాలని మరియు వాహన ముందు, వెనుక భాగాల స్పష్టమైన ఫోటోలను అప్‌లోడ్ చేయాలని వినియోగదారులకు సూచించబడింది. ప్రతి ఫాస్ట్ టాగ్ యజమాని యొక్క మొబైల్ నంబర్‌తో అనుసంధించాలి. ఈ నిబంధనలను పాటించడానికి వినియోగదారులు అక్టోబర్ 31లోపు తమ కెవైసీను నవీకరించుకోవాలి.

Share