విశాఖ బీచ్‌లో మారుతున్న కెరటాల ఆటుపోట్లతో, సాధారణ సమయంలో కనిపించని దృశ్యాలు కనిపిస్తున్నాయి. సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో తీరంలో రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత మళ్లీ కెరటాలు వెనక్కి వెళ్ళినట్టు కనిపించాయి. ఆ తర్వాత రోజు కూడా అటువంటి దృశ్యాలే కనిపించాయి. ఇవి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాయి. బీచ్‌కు వచ్చిన టూరిస్టులు, సరదాగా ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. గతంలోనూ ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. వెనక్కు వెళ్లిన సముద్రం మళ్ళీ సాధారణంగా మారింది. పున్నమికి, అమావాస్యకు ఇలా జరగడం సహజమే అంటున్నారు స్థానిక మత్స్యకారులు. సముద్రంలో ఇలా మార్పులు వచ్చినప్పుడు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.