ఒలింపిక్స్‌కి వచ్చి బాయ్‌ఫ్రెండ్‌తో షికారుకు వెళ్లిన అథ్లెట్‌ను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపేశారు. బ్రెజిల్‌కు చెందిన స్టార్ స్విమ్మర్ కరోలినా వియెరా పోటీ కోసం ప్రిపేర్ అవుతూ.. మధ్యలో ఆమె ప్రియుడు శాంటోస్‌తో కలిసి పోటీకి ముందు షికారుకి వెళ్లింది. ఇద్దరూ కొన్ని గంటల పాటు చెట్టాపట్టాలేసుకుని పారిస్‌లో తిరిగి.. మళ్లీ క్రీడా గ్రామంలోకి అడుగుపెట్టారు. కానీ.. అప్పటికే ఒలింపిక్స్ నిర్వాహకులకి కోపం వచ్చింది. వెంటనే స్విమ్మర్ కరోలినాని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో ఆమె పోటీపడకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమె ప్రియుడు శాంటోస్‌ను మాత్రం పోటీలకు అనుమతి ఇచ్చింది. పురుషుల 4×100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో పోటీపడిన శాంటోస్ పేలవ ప్రదర్శనతో ఓడిపోయాడు. ఒలింపిక్ గ్రామాన్ని వీడి బయటకు వెళ్లాలంటే బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇద్దరూ బయటికి వెళ్లి మూల్యం చెల్లించుకున్నారు.
Share