Current Date: 27 Nov, 2024

వంగవీటి రాధాకు గుండెపోటు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.

Share