Current Date: 06 Oct, 2024

బాబు, పవన్‌కి ప్రకాశ్ రాజ్ ఉచిత సలహా.. మోడీనే టార్గెట్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చాలా మంది సెలెబ్రిటీలు పవన్ కళ్యాణ్‌కి విషెస్ చేప్తున్నారు. తెలుగుకేంద్రప్రభుత్వంలోనూకీలకపాత్రపోషించనున్నాయి. రెండు పార్టీలకు కేంద్రమంత్రి వర్గంలోనూ చోటు దక్కనుందని వార్తలు వస్తున్నాయిసినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ ఓ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపిన ప్రకాష్ రాజ్.. మోడీలా కాకుండా సెక్యులర్ భావాలు కలిగి ఉంటారని భావిస్తున్నా అన్నారు.జాతీయ రాజకీయాల్లో వచ్చిన అవకాశంతో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా చూడాలని ప్రకాష్ రాజ్ కోరారు. దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా పవన్‌, ‌చంద్రబాబులపై ఉందంటూ చెప్పుకొచ్చారు.