ఏపీలో 100% స్రైక్‌రేట్‌తో గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన జనసేన.. 2026 ఎన్నికల్లో తమిళనాడులోనూ పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ప్రజల అభీష్టం మేరకే తమిళనాడులో జనసేన అడుగు పెడుతుందని ఓ తమిళ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.సినిమాల్లో నటిస్తూ.. వెంటనే ముఖ్యమంత్రి కావడం కష్టమని ఇంటర్వ్యూలో పవన్ చెప్పగా.. ఎన్టీఆర్‌కు జరగలేదా? అనే ప్రశ్న ఎదురైంది. దాంతో పవన్ అది అరుదైన ఘటన అంటూ బుకాయించారు. తమిళనాడులో 2026 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, విజయ్ కూటమి ఏర్పాటు చేస్తే పవర్‌ఫుల్ కాంబోగా ఉంటుందని వినిపిస్తున్న అభిప్రాయాలపై ప్రశ్నించగా... అది ఎడప్పాడి పళనిసామి, విజయ్ మధ్య ఉన్న కెమిస్ట్రీపై ఆధారపడి ఉంటుందని తెలివిగా సమాధానం ఇచ్చారు.భవిష్యత్తులో అన్నాడీఎంకేతో జనసేన పొత్తు అవకాశాలను కొట్టి పారేయలేమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Share