Current Date: 06 Oct, 2024

ఈ సారైనా గంగమ్మ కరుణిస్తుందా?

రెండు నెలల పాటు వేటకు దూరమైన మత్స్యకారులు మళ్లీ బతుకు దెరువు కోసం సిద్ధమవుతున్నారు. మత్య్స సంపద పెంపు కోసం ఏటా ఏప్రిల్ 15నుంచి జూన్ 15వరకు ప్రభుత్వం వేట నిషేధం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ రాత్రి నుంచి వేట నిషేధం ఎత్తివేస్తుండడంతో జాలర్లంతా వలలు సిద్ధం చేసుకున్నారు. బోట్లకు మరమ్మతులు పూర్తి చేశారు. వేట నిషేధం అమలులో కొంతమంది జాలర్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, ఆధార్ కార్డుల్లో తప్పులున్నాయంటూ అధికారులు తమ కాళ్ల చుట్టూ జాలర్లను తిప్పించుకుంటున్నారు. దీంతో వేట మొదల్కెతే కనీసం మూడు పూటలా తినేందుకైనా ప్రోత్సహం లభిస్తుందనే గంపెడాశతో జాలర్లున్నారు. గంగమ్మ తల్లికి పూజలు జరిపి శుక్రవారం రాత్రి నుంచి వేట మొదలెట్టేందుకు విశాఖ తీరాల్లో మత్స్యకారులు సిద్ధమయ్యారు.

Share