మధురవాడ జంక్షన్లోని రామ్మోహన్ నాయుడు జువెలరీ షాపులో మంగళవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దొంగలు షాపు వెనుక ఉన్న మార్కెట్ వైపు నుంచి గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు.సుమారు 20 కేజీల వెండి వస్తువులతో పాటు వరలక్ష్మి కాసులను దోచుకెళ్లారు. ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు,వాటి డీవీఆర్ పరికరాలను కూడా వెంట తీసుకెళ్లారు.ప్రధాన బంగారు ఆభరణాలు ప్రత్యేక లాకర్లో భద్రంగా ఉండటంతో అవి దొంగల బారిన పడకుండా మిగిలాయి. పక్కనే ఉన్న స్వీట్ షాప్, షూమార్ట్ సీసీ ఫుటేజీలను క్రైమ్ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
దొంగలను పట్టుకోవడానికి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.