టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. అమ్మాయిల ఆకర్షణలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సూచించాడు. వైభవ్ కెరీర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అతని తల్లిదండ్రులు, టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే ఉందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైభవ్ దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపగల సామర్థ్యం కలిగినవాడని, అయితే తన కెరీర్‌ను అతడు ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది అత్యంత కీలకమని అభిప్రాయపడ్డాడు. గతంలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు 17-18 ఏళ్ల వయసులోనే అపారమైన క్రేజ్ తెచ్చుకుని, ఆ తర్వాత అకస్మాత్తుగా వెనుకబడిపోయిన విషయాన్ని ఉతప్ప గుర్తుచేశాడు. వైభవ్‌కు అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే మేజర్ అయిన తర్వాత ఆటపరంగా, వ్యక్తిత్వంపరంగా.. మరీ ముఖ్యంగా అమ్మాయిల ఆకర్షణలో పడి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించాడు. అతడిలో ఎంతో అమాయకత్వం ఉందని, అతడు క్రికెట్ కోసమే పుట్టాడని కొనియాడాడు.
Share