వైసీపీ వాళ్లకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పనులు చేయవద్దు.. వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టే అని సీఎం చంద్రబాబు చెప్పడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని టీడీపీ వాళ్లు చెప్తున్నారు.వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకి ఇటీవల బిల్లుల చెల్లింపులు భారీగా జరిగాయి. ఇందులో అధికారుల చేతివాటం కూడా ఉన్నట్లుంది. వైజాగ్ రుషికొండ భవనాల పనులు చేసిన కాంట్రాక్టరుతో సహా చాలా చోట్ల బిల్లుల చెల్లింపులు జరిగిపోయాయి. టీడీపీ వాళ్లే లోపాయికారీగా వైసీపీ వారితో కలిసి ఈ బిల్లుల చెల్లింపులో సహకరిస్తున్నారు.ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంపై చంద్రబాబుకి ఫిర్యాదులు అందడంతోనే వైసీపీ వారికి పనులు చేయవద్దు అంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే.. చంద్రబాబు చెప్పినంత మాత్రాన.. వినే పరిస్థితుల్లో చాలా మంది కూటమి నేతలు లేరు.