మంత్రి నారా లోకేశ్ ఈ నెల 5న విశాఖలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వ చొరవతో విశాఖకు తిరిగి వచ్చిన ఐటీ దిగ్గజం 'ఐబీఎం' కార్యకలాపాలను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనిద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే, పీవీ సింధు ఏర్పాటు చేస్తున్న క్రీడా కేంద్రాన్ని కూడా మంత్రి పరిశీలిస్తారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.