Current Date: 05 Aug, 2026

కాసేపటి వర్షానికే విశాఖ ఉలిక్కిపడింది..!

విశాఖలో కురిసిన కాసేపటి వర్షమే నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గంటల తరబడి వర్షం కురవకపోయినా... కేవలం కొద్దిసేపు కురిసిన వర్షానికే రెండు వేర్వేరు చోట్ల ప్రమాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. సీతమ్మధారలో భారీ వృక్షం ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ కారు ధ్వంసమైంది. మరోవైపు రైల్వే స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లడ్‌లైట్ నేలకూలింది. అదృష్టవశాత్తూ ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టం జరగలేదు. అయితే కేవలం స్వల్ప వర్షానికే ఇలాంటి ఘటనలు జరగడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వర్షాకాలం ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పాత వృక్షాలు, భారీ నిర్మాణాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.