DMK సభలో నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వాడారంటూ టీవీకే మండిపడింది. ఆయనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. కావేరీ జలాల అంశంపై ఉదయనిధి మాట్లాడుతుండగా పలువురు త్రిష.. త్రిష అంటూ <<20553063>>నినాదాలు<<>> చేశారు. దీంతో ఆయన నవ్వుతూ ‘కావేరి సమస్యపై CM నోరు విప్పట్లేదు. నీరు ఎక్కడికీ చేరకపోయినా అక్కడికి మాత్రం చేరాలి. నేను అన్నది కావేరీ నీళ్ల గురించే’ అని వ్యాఖ్యానించారు.