Current Date: 05 Oct, 2024

కార్మిక సమస్యల పరిష్కారానికి మరి కొంత సమయం కావాలన్న అదానీ పోర్టు

కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం మరికొంత గడువు కోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిరది. హైకోర్టు ఉత్తరువుల దరిమిలా సోమవారం యాజమాన్య ప్రతినిధులు, కార్మిక నాయకులతో సమావేశం జరిగింది. అయితే గంగవరం పోర్టు యాజమాన్యం అడిగిన మరింత సమయాన్ని ఇవ్వలేమని కార్మిక నాయకులు తేల్చి చెప్పేయడంతో చర్చలు అక్కడితో ఆగిపోయాయి. అయితే కలెక్టరు, పోలీసు కమిషనర్‌ తమ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించాలని కార్మిక నాయకులు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి సూచించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ దృష్టికి తెచ్చినట్టు కూడా తెలిసింది.
గంగవరం పోర్టు నుంచి ముడిసరుకును వెంటనే ఉక్కుకు అందించాలంటూ ఉక్కు ఎగ్జిక్యూటీవ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు జారీ చేసిన ఉత్తరువులకు సంబంధించి కలెక్టర్‌ మల్లికార్జున ప్రొసీడిరగ్స్‌ను విడుదల చేశారు.
ఉక్కు సీఎండీ, అదానీ పోర్టు సీఇఓ, పోలీసు కమిషనర్‌, గాజువాక ఏసీపీ, గంగవరం పోర్టు కార్మిక సంఘ అధ్యక్షుడు, గంగవరం పోర్టు ఆర్‌అండ్‌ఆర్‌ ఉద్యోగుల సంఘానికి దీని కాపీలను పంపించారు.
ఇందులో ఆర్‌అండ్‌ఆర్‌ ఉద్యోగులు తమ సంప్రదింపుల్ని కొనసాగించుకోవచ్చని, అయితే కన్వీయర్‌ బెల్ట్‌ ద్వారా విశాఖ ఉక్కుకు చెందిన బొగ్గును రవాణా చేసుకోడానికి ఆర్‌అండ్‌ఆర్‌ ఉద్యోగులు అనుమతించాలని, బొగ్గును విశాఖ ఉక్కుకు రవాణా చేసే సందర్భంలో ఆర్‌అండ్‌ఆర్‌ ఉద్యోగులు ఎటువంటి అంతరాయాన్నీ కలిగించరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కలెక్టర్‌ వీరికి తెలియజేశారు. అంతే కాకుండా అంబులెన్స్‌, ఫైర్‌ ఇంజన్‌ వాహనాలను, రవాణా వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదని ఇదే సమయంలో పోలీసు కమిషనర్‌ ఎప్పటికప్పుడు శాంతి, భద్రతల పరిస్థితిని సమీక్షించాలని, వచ్చే వాయిదాకు దీనిపై ఒక నివేదికను అఫిడవిట్‌ ద్వారా సంబంధిత శాఖలు హైకోర్టుకు సమర్పించాలని కలెక్టర్‌ తన ప్రొసీడిరగ్స్‌లో తెలిపారు.