పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే వారి పిల్లలు కూడా పయనిస్తున్నారు. సింప్లిసిటీలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకుంటున్నారు. తాజాగా పవన్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక తల్లి రేణూ దేశాయ్ అయితే తెగ మురిసిపోయింది. తాజాగా ఆద్య తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా ఉంటాయి. కేక్ కటింగ్, పార్టీలు, విందులు, వినోదాలు, ఫ్రెండ్స్.. ఇలా తమకు నచ్చిన రీతిలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆద్య మాత్రం సింపుల్ గా తన పుట్టిన రోజును జరుపుకొంది. దీనికి సంబంధించి రేణూ దేశాయ్ కు ముందే చెప్పిందట. బర్త్ డే కదా అని హడావిడి, హంగామా ఏమీ వద్దని, చాలా సింపుల్గా బర్త్ డేను సెలెబ్రేట్ చేయమని రేణూను కోరిందట ఆద్య. వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జీవోకి వాడమని చెప్పిందట. తద్వారా ఎన్నో మూగ జీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట.
Share