Current Date: 02 Oct, 2024

రజనీకాంత్ హెల్త్‌పై అప్‌డేట్ కంగారొద్దన్న సూపర్ స్టార్ భార్య

 సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్యం విషయమై గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా పేర్కొన్నారు. రజనీకాంత్‌ భార్య లత సైతం స్పందించారు. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆమె తెలియజేశారు.రజనీకాంత్ గత కొన్ని రోజులుగా వేట్టయాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు, ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

Share