అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2వేల 245 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్ల మేర అమరావతి రాజధానికి ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కాబోతోంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ నిర్మించబోతున్నారు. మరోవైపు అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి మార్గం సులువు కాబోతోంది. ఇక మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మించబోతున్నారు. మరోవైపు కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర పొడవైన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కొత్తగా నిర్మించే రైల్వే లైన్ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఏర్పాటు చేస్తామన్నారు.