బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కీలక నిర్ణయం తీసుకున్నారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై చెలరేగిన హింస దేశంలో సైనికపాలన అమలు దిశగా సాగుతోంది. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమెకు భారత్లో ఆశ్రయం ఇవ్వనున్నారని సమాచారం. ఆర్మీ హెచ్చరికలతో ఆమె దేశం విడిచి వెళ్లినట్లు బంగ్లా మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిరసనల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.