Current Date: 06 Oct, 2024

మెగా కోడలికి గాయం కొన్నాళ్లు సినిమాలకి దూరం!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు గత కొన్ని రోజులుగా వెకేషన్స్ అంటూ తిరుగుతూనే కనిపిస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠికి ఓ చిన్న ప్రమాదం జరిగింది. నెల రోజుల క్రితం మెట్లు దిగుతున్న టైంలో స్లిప్ అయిందట. ఈ క్రమంలో చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది.నెల అయినా ఆ నొప్పి తగ్గక పోవడంతో ఇటీవల స్కానింగ్ తీయించగా.. లోపల యాంకిల్ ఫాక్చర్ అయిందని రిపోర్ట్ వచ్చింది. దాంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. గాయంతో లావణ్య సినిమా లైఫ్‌ను కాస్త పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ను కూడా ఆమె అంగీకరించడం లేదు.వరుణ్ తేజ్ మాత్రం మట్కా మూవీతో బిజీ కానున్నాడు.

Share