Current Date: 03 Oct, 2024

కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. రవాణా సౌకర్యాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.  అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాటు చేసింది. వర్షాలు తగ్గేవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Share