Current Date: 03 Oct, 2025

పవన్ సినిమాకి ఓజీకి టికెట్ రేట్లు భారీగా పెంపు.. జీవో విడుదల

పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలకి సిద్ధమైంది. సెప్టెంబరు 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా.. టికెట్ల రేట్లను భారీగా పెంచుకునే వెసులుబాటుని కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

సెప్టెంబరు 25న తెల్లవారుజామున 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్‌ షో టికెట్‌ ధర రూ.1000గా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. సెప్టెంబరు 25 నుంచి నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 మేరకు పెంచుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.

సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్‌ ఓజాస్‌ గంభీరగా కనిపించనున్నారు. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ నటించగా.. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ పాత్ర పోషించాడు.

Share