Current Date: 03 Oct, 2025

హైదరాబాద్‌‌లో మళ్లీ క్లౌడ్‌ బరస్ట్‌.. నగరం కకావికలం

ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా హైదరాబాద్‌‌లో క్లౌడ్‌ బరస్ట్‌‌తో నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. వాహనదారులు బెంబేలెత్తిపోయారు.

భారీ వర్షానికి రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్‌మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్‌ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది.

భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  మాదాపూర్‌–హైటెక్‌ సిటీ చౌరస్తా,  రాయదుర్గం, అమీర్‌పేట బంజారాహిల్స్‌ ఐకియా మార్గంలో, మియాపూర్‌– చందానగర్‌ నగర్‌ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు.

Share