హీరో అల్లు అర్జున్‌కి తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే.. బెయిల్‌కి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడమే. దాంతో శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా ఇద్దరు ఖైదీలతో కలిసి చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది.బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు ఆగమేఘాల మీద సర్టిఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు భీష్మించుకుని కూర్చొన్నారు. దాంతో రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్‌ను జైలు రిసెప్షన్‌లోనే ఉండి.. ఆ తర్వాత మంజీరా బ్యారక్‌లోని క్లాస్–1 రూమ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు.జైల్లో అల్లు అర్జున్‌కి భోజనం ఆఫర్ చేసినా అల్లు అర్జున్ తినలేదట.. రాత్రి కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు. వాస్తవానికి అల్లు అర్జున్‌ని ప్రత్యేక ఖైదీగా పరిగణించి సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించినా.. జైల్లోకి వచ్చిన తరువాత రోజు మాత్రమే అవి అందుబాటులోకి వస్తాయి. దాంతో ఇద్దరు రిమాండ్ ఖైదీలతో కలిసి అల్లు అర్జున్ బ్యారక్‌లో గడిపి శనివారం ఉదయం బెయిల్‌పై విడుదల అయ్యారు.