Current Date: 06 Oct, 2024

పేదవాడి ఇంటి కంటే మీ ప్యాలెస్‌లో బాత్రూం సైజు పెద్దదే ట్విట్టర్‌లో గంటా ఫైర్‌

 పేదవాడి ఇంటి కంటే మీ ప్యాలెస్‌లో బాత్రూం సైజు పెద్దదేనని మాజీ సీఎం జగన్‌నుద్దేశించి మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ట్టిట్టర్‌ (ఎక్స్‌)లో స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులకు మనం కేవలం కస్టోడియన్లమేనన్న వాస్తవాన్ని గ్రహించనంత వరకు ఏ రాజకీయ పార్టీ ప్రజలకు చేరువ కాలేదని, అవసరమున్న చోట పనులు చేపట్టకపోవడం ఎంత బాధ్యతా రాహిత్యమో, అవసరం లేని చోట వందల కోట్లు దుబారా కూడా అంతే బాధ్యతా రాహిత్యమంటూ రుషికొండ భవనాల్ని ఉద్దేశించి గంటా చెప్పుకొచ్చారు.

Share