కేంద్రంలో భాగస్వామ్యం కావడానికి టీడీపీ నేత చంద్రబాబు అంగీకరించడంతో ఉత్తరాంధ్రా నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఏర్పడిరది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయస్సులో కేంద్ర మంత్రి కాబోతుండడం విశేషం. తన తండ్రి దివంగత నేత కింజరాపు యర్రంనాయుడు గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వశాఖనే తనకూ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌లకు కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దొరికే అవకాశం ఉంది.