Current Date: 24 Sep, 2024

మహేష్ హెయిర్ స్టయిల్‌పై నెటిజన్ జోక్ రాజమౌళికి సూటి ప్రశ్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విరాళాన్ని చెక్కు రూపంలో అందజేయడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలలో మహేష్ కొత్త లుక్ వైరల్ అవుతోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ప్రస్తుతం మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌  స్పీడుగా జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళతారని కూడా ఫిలింనగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ సినిమా కోసమే కొన్ని నెలలుగా మహేష్ బాబు ప్రిపేర్ అవుతున్నారు. ఫిజికల్ వర్కౌట్స్ చేయడంతో పాటు మేకోవర్ మీద ఆయన దృష్టి పెట్టారు.  రాజమౌళి తన హీరోలకు కొత్త లుక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్పటి వరకు ఆయా హీరోలు చేసిన సినిమాలతో పోల్చి చూసినప్పుడు. దర్శక ధీరుడు సినిమాలో కొత్త లుక్ ఉంటుంది.మహేష్ బాబు కొన్ని రోజులుగా తన లుక్ రివీల్ కాకుండా చూస్తూ వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు గానీ  ఆ తర్వాత విదేశాలకు ఫ్యామిలీతో వెళ్లి వచ్చినప్పుడు గానీ  హెయిర్ స్టైల్ రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు.‌ క్యాప్ పెట్టుకుని కనిపించారు. 

Share