Current Date: 27 Nov, 2024

ఛాలెంజ్ విసిరి మంత్రి పదవి పోగొట్టుకున్న బీజేపీ సీనియర్‌ నేత!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సవాల్ విసిరిన ఓ మంత్రి.. మాటకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేశారు. తాను బాధ్యత వహించిన నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోతే రాజీనామా చేస్తానని బీజేపీ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మంత్రి కిరోడి లాల్‌ మీనా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఛాలెంజ్ చేశారు.కిరోడి లాల్‌ మీనాకు అప్పగించిన అన్ని స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. దీంతో ఆయన తన మంత్రి పదవికి తాజాగా రాజీనామా చేశారు. రాజస్థాన్‌ ప్రభుత్వంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా పలు శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌లో బీజేపీ ముఖ్య నేతల్లో ఆయన ఒకరు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దౌసా సహా రాజస్థాన్‌లో ఏడు పార్లమెంట్ స్థానాలకు మీనాను ఇంఛార్జిగా నియమించింది బీజేపీ అధిష్ఠానం. బీజేపీ గెలుపుపై అతివిశ్వామో లేక మంత్రి అహంకారమో తెలియదు కానీ ఎన్నికల్లో ఏ ఒక్క సీటులో బీజేపీ ఓడిపోయినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల ఫలితాలకు కొద్ది గంటల ముందు సవాల్ విసిరారు. ఆయన అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ బీజేపీ 14 సీట్లలో మాత్రమే గెలుపొందింది

Share