ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అలాగే పలు ద్వైపాక్షిక సమావేశాలతో పాటు అక్కడి భారతీయ ప్రవాసులతో కూడా భేటీ కానున్నారు. ఈ పర్యటనకు బయల్దేరడానికి ముందు ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. ''ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావాలి. అలాగే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను. ఈ క్రమంలో మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నాను. ఇక 'ది సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' మానవాళి అభివృద్ధికి ప్రపంచ సమాజానికి ఒక అవకాశం" అని ప్రధాని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Share