తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రపంచ వ్యాప్తంగా ఆలయాల నిర్వహణలో రోల్ మోడల్‌గా నిలిచిందని టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.వి.ధర్మా రెడ్డి గతంలో అభిప్రాయపడ్డారు. 'దేవాలయాల మహా కుంభ్' అని మూడు రోజుల అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్‌పో సందర్భంగా 30 దేశాలకు చెందిన ఆలయ నిర్వాహకులను ఉద్దేశించి ధర్మారెడ్డి అప్పట్లో పైవ్యాఖ్యలు చేశారు.దేవాలయాల సమర్థ నిర్వహణలో భక్తి తప్పనిసరి. విద్య, ఆరోగ్యం, వేద అభ్యాసం, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేంద్రంగా టీటీడీ ఉద్భవించింది అని ధర్మారెడ్డి బాహాటంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక కొత్త ఈవోని నియమించింది. ధర్మారెడ్డిని బదిలీ చేస్తూ ఈవోగా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావునునియమించింది.కానీఇప్పుడుతిరుమలలడ్డులోజంతువులకొవ్వుకలిపారనిఆరోపణలురావడంతోధర్మారెడ్డివ్యాఖ్యల్నిఅందరూగుర్తుచేసుకుంటున్నారు.గతప్రభుత్వ పాలనలో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి భారీగా అక్రమాలకు తెగబడ్డారని, వారిపై సీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
Share