Current Date: 26 Jul, 2026

రీల్స్ పిచ్చి.. ఒకే కుర్రాడిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా ధౌరియా గ్రామానికి చెందిన ముగ్గురు సోదరీమణులు అల్కా, దేవిక, సంతోష్‌ సోషల్‌ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి చేసుకుంటే వేర్వేరు ఇళ్లకు వెళ్లి విడిపోవాల్సి వస్తుందనే భయంతో, ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకోసం తమ వీడియోలను చిత్రీకరించే శ్యాంపురి గ్రామానికి చెందిన కెమెరామెన్ వికాస్‌ను ఎంచుకున్నారు.

ఇటీవల స్థానిక ఆలయంలో ఈ ముగ్గురూ వికాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వింత వివాహం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇరు వైపులా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి దూరంగా ఉన్నారని, ముగ్గురిలో ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు కాగా మరొకరు వరుసకు సోదరి అవుతారని సమాచారం.

ఈ బహుభార్యత్వాంపై నెటిజన్ల నుంచి, కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఆ ముగ్గురు యువతులు ఒక వీడియో విడుదల చేస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాము సంతోషంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, జీవితాంతం కలిసి ఉంటామని స్పష్టం చేశారు. పోలీసులు సైతం ఈ విషయంపై విచారణ జరపగా, తాము స్వచ్ఛందంగానే వికాస్‌ను పెళ్లి చేసుకున్నామని వారు పోలీసులకు తెలిపారు.

Share