ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పారని ఫ్యాన్ పార్టీ అధినేత తెలిపారు. అయినా పోలీసులు అరెస్టు చేయడం సరికాదని వైసీపీ అధినేత అభిప్రాయపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు సరికాదని మాజీ సీఎం జగన్ అన్నారు.