దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్, నెట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతుందని, పేపర్ లీకేజీపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోదంన్నారు. నిందితులపై చర్యలు తప్పవన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తెలియజేస్తుందన్నారు. అలాగే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు మూడోసారి విశ్వాసం చూపించారని తెలిపారు.