ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లే గెలిచింది. దాంతో అసెంబ్లీకి వెళ్లడానికి కూడా మాజీ సీఎం వైయస్ జగన్‌కి సిద్ధపడటం లేదు. అందుకే తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఆయన లేఖ రాశారు. అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో జగన్‌కి అనుకూలించే విషయమే.ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, అలాగే వాటికి అదనంగా మరికొన్నింటిని చేర్చి కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో అమలుపై జగన్ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే అభిప్రాయం జనంలో కలిగిన తర్వాతే, వాళ్ల చెంతకు వెళితే ఆదరణ దక్కుతుందని జగన్ భావిస్తున్నారు.ఎటూ అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో నిత్యం ప్రజల్లో వుండడానికే జగన్ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల పులివెందులలో జగన్ మూడు రోజుల పర్యటనలో జనం బాగానే వచ్చారు. నిజానికి ఓడిపోయాక ఇంత తక్కువ సమయంలో జనం వస్తారని జగన్ కూడా ఊహించలేదు. దాంతో మళ్లీ జనంలోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకోగా సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది
Share